బాలీవుడ్ ముద్దుగుమ్మ విద్యాబాలన్ ఓ పక్క బోల్డ్ క్యారెక్టర్స్ లో, మరోపక్క హోమ్లీ క్యారెక్టర్స్ లో నటిస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తోంది. తన వయసుకి తగ్గ పాత్రలు ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె 'శకుంతలా దేవి' అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

హ్యూమన్ కంప్యూటర్స్ గా పేరుగాంచిన గణితవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విద్య తనపై కామెంట్స్ చేస్తున్న వారికి ధీటుగా బదులిచ్చింది. తనంటే నచ్చని వారు తను నటించే సినిమాలు చూడనక్కర్లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.

'డర్టీ పిక్చర్', కహానీ' వంటి సినిమాల తరువాత సొంతంగా సినిమాలను ఎంపిక చేసుకోవడం నేర్చుకున్నానని చెప్పింది. తన బోల్డ్ నెస్ తో అన్ని భాషల్లోనూ నటిస్తున్నట్లు.. తను ఎంపిక చేసుకునే సినిమాలు కొందరికి నచ్చుతాయి.. కొందరికి నచ్చవని చెప్పింది. తనంటే ఇష్టంలేని వారు తన సినిమా చూడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.

ఇటీవల ఆమె నటించిన 'మిషన్ మంగళ్' సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. ఆ తరువాత తమిళంలో 'నేర్కొండ పార్వాయ్' అనే సినిమాలో అజిత్ కి భార్య పాత్రలో నటించింది. ఇప్పుడు ఆమె నటిస్తోన్న 'శకుంతలా దేవి' సగానికి పైగా షూటింగ్ అయిపోయింది. సినిమాలో ఆమె కూతురు పాత్రలో సాన్య మల్హోత్రా కనిపించనుంది. అను మేనన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.