టాలీవుడ్ అగ్ర హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ కు ఉన్నంత క్రేజ్ మరో హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల వెంకటేష్ వరుసగా మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. వెంకటేష్ సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది వెంకీ నుంచి వచ్చిన ఎఫ్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించింది. వెంకీ కెరీర్ లోనే అత్యధికంగా ఎఫ్2 80 కోట్ల వరకు షేర్ రాబట్టింది. 

ఆ చిత్రంలో వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టి మునుపటి వెంకీని గుర్తు చేశాడు. ప్రస్తుతం వెంకీ నటిస్తున్న చిత్రం వెంకీమామ. ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా ఓ హీరోగా నటిస్తున్నాడు. మామ అల్లుళ్లు కలసి నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం వెంకటేష్ హోమ్ ప్రొడక్షన్ సురేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం తర్వాత అసురన్ రీమేక్ కూడా సురేష్ బాబు నిర్మాణంలోనే తెరకెక్కనుండడం విశేషం. 

సొంత బ్యానర్ లో చేసే చిత్రాలకు రెమ్యునరేషన్ పెద్ద సమస్య కాదు. అసురన్ తర్వాత వెంకీ ఇతర నిర్మాతలతో వర్క్ చేయబోతున్నాడట. ఆ చిత్రాలకు వెంకటేష్ రెమ్యునరేషన్ పెంచేస్తునట్లు వార్తలు వస్తున్నాయి. కుర్ర హీరోలు వచ్చాక సీనియర్ హీరోల ప్రభావం కాస్త తగ్గుతుంది. కానీ వెంకటేష్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తున్నాయి. ఇక నుంచి సినిమాకు 10 కోట్ల వరకు వెంకటేష్ ఛార్జ్ చేయబోతున్నాడట.ఇప్పటి  వరకు వెంకీ రెమ్యునరేషన్ 10 కోట్ల లోపే ఉండేది.    

మల్టీస్టార్ట్ సినిమా అంటే దర్శకులకు ముందుగా వెంకటేష్ గుర్తుకు వస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ ప్రచార కార్యకమాల్లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ బాబీ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు.