Asianet News TeluguAsianet News Telugu

రవితేజ సినిమా కోసం రీసెర్చ్.. డిస్కోరాజాపై దర్శకుడి కామెంట్స్!

వరుస పరాజయాల అనంతరం రవితేజ నటిస్తున్న చిత్రం డిస్కో రాజా. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ విఐ ఆనంద్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

VI Anand reveals interesting details about Disco Raja
Author
Hyderabad, First Published Dec 27, 2019, 9:59 PM IST

వరుస పరాజయాల అనంతరం రవితేజ నటిస్తున్న చిత్రం డిస్కో రాజా. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ విఐ ఆనంద్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకులని థ్రిల్ కి గురిచేయాలని భావించే దర్శకుడు విఐ ఆనంద్. డిస్కోరాజా చిత్రం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అంశాలు ప్రేక్షకులకు నమ్మశక్యంగా ఉండేలా.. లాజిక్ లోపం లేకుండా అర్థమయ్యేందు తాము రీసెర్చ్ చేసినట్లు విఐ ఆనంద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

సైన్స్ కు సంబంధించిన పలు అంశాలపై అవగాహన పెంచుకున్న తర్వాతే ఈ చిత్ర పూర్తి కథ సిద్ధం చేసినట్లు తెలిపారు. సైన్స్ ఫిక్షన్ అంశాలు ఉంటూనే రవితేజ మార్క్ ఎంటటైన్మెంట్ కూడా ఈ చిత్రంలో ఉంటుందని ఆనంద్ తెలిపారు. 

ఈ చిత్ర టైటిల్ లోగోలో కనిపిస్తున్న సీతాకోక చిలుకకు కథలో ఏదైనా ప్రాధాన్యం ఉందా.. బటర్ ఫ్లై సిద్ధాంతాన్ని ఈ చిత్రంలో ఉపయోగిస్తున్నారా అని ప్రశ్నించగా విఐ ఆనంద్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సీతాకోక చిలుకకు ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉంది. కానీ అది బటర్ ఫ్లై సిద్ధాంతం మాత్రం కాదు అని ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్ర టీజర్ లో కొందరు రవితేజ బాడీ పై మెడికల్ ప్రయోగం చేస్తున్నట్లు చూపించారు. దీనితో సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. జనవరి 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదుల చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios