నిజ జీవీత మామా అల్లుళ్లైన వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’ . కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్స్. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.  డిసెంబర్‌ 13 అంటే నిన్న వెంకటేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌  అయ్యింది.

వాస్తవానికి ఈ నెల సినిమాలకు అన్ సీజన్. దానికి తోడు ఈ సినిమాకు మిక్సెడ్ రివ్యూలు వచ్చాయి. కొందరు చాలా బాగుంది అని ఎత్తేస్తే మరికొందరు ఎనభైల్లో ఆగిపోయిన సినిమా అని తేల్చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి...ఆక్యుపెన్సీ రేటు ఎలా ఉందో చూద్దాం.

ఈ చిత్రం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో  చెప్పుకోదగ్గ ఆక్యుపెన్సీను సొంతం చేసుకుంది.  మార్నింగ్ షో, మాట్నీ  షోలలో ఆక్యుపెన్సీ దాదాపు అరవై నుంచి ఎనభై శాతం దాకా  ఉంది. దాంతో మొదటి రోజు కలెక్షన్లు అద్బుతం కాదు కానీ బాగానే ఉన్నాయి. పెద్ద బ్యానర్, ఫ్యామిలీలను టార్గెట్ చేసిన సినిమా కాబట్టి  వీకెండ్ కూడా  నడిచిపోయే అవకాసం ఉందని  ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరో ప్రక్క  పెద్ద సినిమాలు ఏవి పోటీగా లేకపోవడం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. అయితే వచ్చే శుక్రవారానికి రూలర్, దొంగ, ప్రతిరోజు పండగ చిత్రాలు వరస రిలీజ్ లు ఉండటంతో వాటికి  ఏ మాత్రం పాజిటివ్ టాక్ ఉన్నా.. ఆ ప్రభావం వెంకీ మామపై పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి వెంకీ మామ ఈ వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని రాబట్టాల్సి ఉంటుంది.    ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ నటించగా, నాగచైతన్య సరసన రాశీఖన్నా నటించింది.   తమన్ సంగీతం అందించాడు. బాబీ( కే. యస్ రవీంద్ర ) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.