దగ్గుబాటి వెంకటేష్ - అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామ. గతంలో ఎప్పుడు లేని విధంగా ఫుల్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ మామ అల్లుళ్ళు వెండితెరపై కామెడీతో పాటు యాక్షన్ ని కూడా చూపించబోతున్నారు. ఇక  రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు.

దసరా సందర్బంగా మంగళవారం 11గంటలకు ఫస్ట్ గ్లింప్స్‌ ని విడుదల చేయనున్నట్లు చెప్పారు.  కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే సినిమాను దసరా సెలవుల్లో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ సైరా ఉండడంతో కాస్త వెనుకడుగు వేయలేక తప్పలేదు. ఇక నెక్స్ట్ డిసెంబర్ లో ఎలాగైనా సినిమాను రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

కుదిరితే డిసెంబర్ మొదటివారమే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అందుకే రెండు నెలల ముందే ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక వెంకటేష్ కు జోడిగా ఆర్ ఎక్స్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగ చైతన్యకు జోడిగా రాశి ఖన్నా నటిస్తోంది.