శేఖర్ కమ్ముల చిత్రాలకు మొదటి నుంచీ యుఎస్ మార్కెట్ బావుంటోంది. ఆయనతో సినిమా చేసే వాళ్లకు అది ప్లస్ పాయింట్ గా పరిగణిస్తూంటారు.  రీసెంట్ గా వచ్చిన ఫిదా సైతం అక్కడ దుమ్ము రేపింది. దాంతో శేఖర్ కమ్ముల తన తాజా చిత్రాన్ని సైతం అక్కడ మార్కెట్ నుంచి మాగ్జిమం గైన్ చేయాలని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అదీ కాక రొమాంటిక్ కామెడీలకు యుఎస్ మార్కెట్ లో మంచి హోల్డ్ ఉంది. అది బాగా ప్లస్ అవుతుందని భావించారు.  అయితే వెంకీ మామ చిత్రం దాన్ని దెబ్బకొట్టింది అని ట్రేడ్ లో వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే...నాగ చైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో లవ్ స్టోరీ టైటిల్ తో ఓ ప్రేమ కథా చిత్రాన్ని శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ కూడా ప్రారంభమైంది. శేఖర్ కమ్ముల గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా ఓవర్ సీస్ బిజినెస్ బాగా చేద్దామని అనుకున్నారు. అయితే వెంకీ మామ రిలీజ్ అయ్యాక ...ఆ సినిమా సక్సెస్ కూడా ప్లస్ చేసుకుంటే బాగా వర్కవుట్ చేయవచ్చని భావించారు. అయితే వెంకీ మామ..ఓవర్ సీస్ లో అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. నాగచైతన్య ,వెంకటేష్ ఇద్దరు హీరోలు ఉన్నా మినిమం ఓపినింగ్స్ రాలేదు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు శేఖర్ కమ్ముల సినిమాపై పడుతోందని సమాచారం.

దానికి తోడు ఈ మధ్యకాలంలో ఓవర్ సీస్ లో భారీ ఖర్చు పెట్టి కొన్న సినిమాలు ఏమీ నడవలేదు. సైరా, సాహో లు కొట్టిన దెబ్బ నుంచి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కోలుకోలేదు. ఈ నేపధ్యంలో ఇప్పుడీ సినిమాని ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవటం రిస్క్ అని రెగ్యుల్ డిస్ట్రిబ్యూటర్స్ వెనకడుగు వేస్తున్నారు. మినిమం ఆరు కోట్లు అయినా శేఖర్ కమ్ముల ఓవర్ సీస్ రైట్స్ నుంచి ఎక్సెపెక్ట్ చేస్తూంటే... ఆ స్దాయి కనపడటం లేదుట. చాలా తక్కువ రేటుకు కోట్ చేస్తున్నారని వినికిడి. కేవలం శేఖర్ కమ్ముల కు ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని నాలుగు కోట్లు మించి అడగటం లేదట. దాంతో ట్రైలర్, టీజర్ రిలీజ్ అయ్యాక..బిజినెస్ మొదలెడటం బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చారని చెప్తున్నారు