ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ..సినిమాలకు చాలా దారుణమైన కలెక్షన్స్ ఉంటున్నాయని...కరెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్దితుల్లో ఉన్నామని, థియోటర్స్ మెయింటైన్ చేయటం చాలా కష్టమని వాపోతున్నారు. ఇప్పుడు ఆయన మరో సమస్య ఎదుర్కొంటున్నారు. కొద్ది నెలల క్రితం దాకా తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ బాగా అమ్ముడుపోయేవి. అయితే ఇప్పుడు అక్కడా పరిస్దితి తారమారు అయ్యింది. ప్రతీ సినిమామీదా హిందీ బయ్యర్లు ఆసక్తి చూపటం లేదు. రేట్లు బాగా తగ్గిపోతున్నాయి. మహర్షి సినిమాకు వచ్చిన దాంట్లో ఐదు కోట్లు తక్కువగా సరిలేరు నీకెవ్వరు హిందీ డబ్బింగ్ రైట్స్ రేటు పలికింది అంటేనే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో రిలీజ్ కు రెడీ అవుతున్న వెంకీ మామ సినిమా దీ అదే పరిస్దితి అని తెలుస్తోంది.

అప్పటకీ సురేష్ బాబు తన ఇన్ఫూలియెన్స్ అంతా వాడినా తాము అనుకున్న రేటుకు వెంకీ మామను అమ్మలేకపోయారట. అనుకున్న రేటులో సగం మాత్రమే అమ్మగలిగారని చెప్తున్నారు. ఇది ఓ రకంగా సురేష్ బాబుకు బిజినెస్ పరంగా ఊహించని దెబ్బే అంటున్నారు. . ఇకపోతే ఈ సినిమా డిజిటల్ హక్కులను జెమినీ టెలివిజన్ దక్కించుకున్నట్లు కాసేపటి క్రితం ఈ సినిమా యూనిట్ ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.

కాగా త్వరలో రిలీజ్ కాబోతున్న పలు బడా సినిమాల హక్కులు దక్కించుకున్న జెమినీ టివి వారు, ఈ సినిమా హక్కలు కూడా తమకు దక్కినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ‘వెంకీ మామ’ యూనిట్ కు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ధన్యవాదాలు తెలపడం జరిగింది.

విక్టరీ వెంకటేష్ మరియు అక్కినేని నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. యంగ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ మరియు టైటిల్ సాంగ్, అలానే ఎన్నాళ్లకో అనే లిరికల్ సాంగ్స్ శ్రోతలను ఎంతో అలరించడంతో పాటు, సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసాయి.

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై డి సురేష్ బాబు, టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కాగా నాగచైతన్య ఈ సినిమాలో ఒక సోల్జర్ గా నటిస్తుండగా, వెంకటేష్ పల్లెటూరిలో ఉండే ఒక రైతుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది!!