2019లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం F2. గత సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా దాదాపు 80కోట్లవరకు లాభాలని అందించింది. అలాగే అపజయాలతో కాస్త తడబడిన వెంకటేష్ - వరుణ్ తేజ్ లకు కూడా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతున్నట్లు అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

చిత్ర యూనిట్ కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది.  అయితే మరోసారి F3 ప్రాజెక్ట్ పై అందరి ద్రుష్టి పడేలా హీరో వెంకటేష్ ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో F2 సీక్వెల్ పై చర్చలు జరుగుతున్నట్లు చెబుతూ.. వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి లతో అప్పుడపుడు కలుసుకొని సినిమాపై డిస్కస్ చేస్తున్నట్లు వెంకటేష్ తెలియజేశారు.

ఇప్పటికే ఒక స్టోరీ లైన్ ఫిక్స్ అయ్యిందని అయితే దాన్ని డెవలప్ చేయడానికి కాస్త సమయం పడుతుందని అన్నారు.  అసురన్ రీమేక్  స్టార్ట్ అయిన తరువాత వెంకీ పూర్తిగా ఆ కామెడీ సీక్వెల్ పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కూడా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్నాడు. నిర్మాత దిల్ రాజు పలు సినిమాలతో బిజీగా ఉండగా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఫైనల్ గా F3 సినిమా సమ్మర్ లో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.