వెంకీ మామ సినిమాతో రెడీ అవుతున్న విక్టరి వెంకటేష్ మరో సినిమాను మొదలుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే తరుణ్ భాస్కర్ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్ లిస్ట్ పెద్దగానే ఉంది. ఇటీవల సురేష్ బాబు అసురన్ తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో దాదాపు వెంకీ ఫిక్స్ అని తెలుస్తోంది.

 అసలు మ్యాటర్ లోకి వస్తే.. వెంకీ లిస్ట్ లో ఉన్న ఒక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. గతంలో తేజ డైరెక్షన్ లో చేయాలనుకున్న ఒక సినిమా షూటింగ్ మొదలైనప్పటికీ ఎవరు ఉహించని విధంగా ఆగిపోయింది. ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్ నుంచి వెంకీ డ్రాప్ అయినట్లు సమాచారం. సినిమా చూపిస్త మావ - నేను లోకల్  చిత్రాల దర్శకుడు త్రినాథ రావ్ నక్కినతో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే.

సురేష్ బాబు నిర్మాతగా ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు వెంకీ ఆ దర్శకుడి కథకు నో చెప్పినట్లు తెలుస్తోంది. వరుసగా వేరే ఆఫర్స్ కి కమిట్ అవ్వడంతో ఇప్పట్లో నీతో వర్క్ చేయలేనని క్లారిటీ ఇచ్చాడట.

దీంతో త్రినాథ్ రావ్ మరో హీరో కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.  కుదిరితే అదే కథను మాస్ మహా రాజా రవితేజతో చేయాలనీ త్రినాథ్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే రవితేజ కూడా చాలా బిజీగా ఉన్నాడు. డిస్కో రాజా అయిపోగానే గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. సో త్రినాథ్ రావ్ ఎలాంటి హీరోతో వర్క్ చేస్తాడో చూడాలి.