ప్రస్తుతం టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఏ స్టార్ హీరో నటించానని మల్టీస్టారర్ చిత్రాల్లో వెంకటేష్ నటిస్తున్నాడు. వెంకటేష్ చివరగా నటించిన వెంకీ మామ, ఎఫ్ 2 రెండు చిత్రాలు మల్టీస్టారర్ చిత్రాలే. ఆ రెండు చిత్రాలు విజయం సాధించాయి. 

వెంకటేష్ ఇప్పటివరకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలందరితో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. తాజాగా వెంకటేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాడు. వెంకటేష్ త్వరలో త్రినాధ్ రావు నక్కిన దర్శత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వెంకీ నటిస్తున్న నారప్ప మూవీ పూర్తి కాగానే ఈ చిత్రం మొదలవుతుంది. 

ఈ చిత్రంలో మరో హీరో కూడా నటించాల్సి ఉంది. దీనికోసం దర్శకుడు త్రినాధ్ రావు మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రానికి ఒకే చెబితే.. వెంకటేష్ మూడో మెగా హీరోతో మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నట్లు అవుతుంది. 

గతంలో వెంకటేష్ పవన్ కళ్యాణ్ తో, వరుణ్ తేజ్ తో కలసి నటించారు.