Asianet News TeluguAsianet News Telugu

తెలుగోళ్లందరికి నేను వెంకీమామనే.. చైతూ చించేశాడు: వెంకటేష్

మల్టీస్టారర్ మూవీ వెంకిమామ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు ఖమ్మంలో గ్రాండ్ గా నిర్వహించారు. ట్రైలర్ ని కూడా విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

venkatesh speech at venkymama pree release event
Author
Hyderabad, First Published Dec 7, 2019, 9:29 PM IST

బిగ్ మల్టీస్టారర్ మూవీ వెంకిమామ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు ఖమ్మంలో గ్రాండ్ గా నిర్వహించారు. ట్రైలర్ ని కూడా విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఈవెంట్ లో వెంకటేష్ స్పెషల్ గా చేసిన కామెంట్స్ ఆడియెన్స్ ఎట్రాక్ట్ చేశాయి.

వెంకటేష్ మాట్లాడుతూ.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరగడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో చైతూకి మాత్రమే వెంకిమామని. అయితే ఇప్పుడు తెలుగోళ్లందరికి వెంకిమమనే.. ఎందుకంటె ఎక్కడికెళ్లినా అందరు వెంకీ మామ అంటున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమాలో చైతు చించేశాడు. మామగా నాకు చాలా గర్వంగా ఉంది. అంతకంటే ఇంకేంకావలి. మామ అల్లుళ్ళ ఎమోషన్స్ ని దర్శకుడు బాబీ చాలా చక్కగా తెరకెక్కించాడు.

అలాగే థమన్ ఇచ్చిన మ్యూజిక్ చాలా ఉపయోగపడింది. అభిమానులు కొంచెం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి.  సినిమాలో అమ్మైనా..నాన్నైనా.. అనే సాంగ్ ఉంది. అలాగే నాకు అండ్డైనా.. దండైనా.. కూడా అభిమానులే. నా 30 ఏళ్ల కెరీర్ నుంచి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈవెంట్ ని చాలా సక్సెస్ చేశారు. అభిమానుల మధ్యలోకి రావాలని ఉంది. కానీ రాలేను కదా.. అంటూ అభిమానుల చేత విజిల్స్ వేయించారు. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందని సినిమాలో ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా వచ్చిందని అన్నారు. ఇక వెంకిమామ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కాబోతోందని వెంకటేష్ మాట్లాడారు.

also read: వెంకీ మామ ట్రైలర్.. మామ అల్లుళ్ళ మోత మాములుగా లేదు 

దగ్గుబాటి వెంకటేష్ - అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఫుల్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వెంకీ మామ. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చి పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది. ఇక నేడు గ్రాండ్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.

 ఇప్పటికే టీజర్ అండ్ సాంగ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండగా ఇప్పుడు వెంకిమామ ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇక సినిమా లో మామ అల్లుళ్ళు మోత మోగించారని అనిపిస్తోంది. డైలాగ్స్ ఎమోషన్స్ అండ్ కామెడీ ఇలా అన్ని నవసరసాలు సినిమాలో ఉన్నట్లు అర్ధమవుతోంది. దర్శకుడు బాబీ చైతు - వెంకీ ల మధ్య క్రియేట్ చేసిన సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా కనెక్ట్ కానున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

మరోవైపు పాయల్ రాజ్ పుత్ - రాశి ఖన్నా గ్లామర్ కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ కా నిలవనుంది. మొత్తానికి ట్రైలర్ తో ఆకట్టుకున్న మామ అల్లుళ్ళు బిగ్ స్క్రీన్ పై ఏ లెవెల్లో మోత మోగిస్తారో తెలియాలంటే డిసెంబర్ 13వరకు వెయిట్ చేయాల్సిందే. సురేష్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు తమన్స్ మ్యూజిక్ అందించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios