F2 సక్సెస్ తరువాత విక్టరీ వెంకటేష్ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా అడుగులు వేస్తున్నాడు. అవకాశాలు ఎన్ని వస్తున్నా కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం వెంకిమామ ప్రాజెక్ట్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న వెంకీ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అసురన్ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

సెన్సిటివ్ కథలను తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించబోతున్నాడు. కొత్త బంగారు లోకం - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - బ్రహ్మోత్సవం వంటి ఒక క్యాటగిరి కథలను తెరకెక్కించిన శ్రీకాంత్ అసురన్ లాంటి యాక్షన్ అండ్ హెవీ ఎమోషనల్ స్టోరీని ఎలా తెరకెక్కిస్తారు అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న సందేహం.  అభిమానుల్లో కొంత ఆందోళన ఉన్నప్పటికీ తప్పకుండా ఈ కథకు శ్రీకాంత్ న్యాయం చేయలగాడని నిర్మాత సురేష్ బాబు గట్టిగా నమ్మరాట.

దీంతో వెంకటేష్ కూడా అన్నయ్య మాటకు విలువనిచ్చి శ్రీకాంత్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇకపోతే అసురన్ కథను ఉన్నదీ ఉన్నట్లుగా చూపించకుండా కథలోని మెయిన్ పాయింట్ ని తీసుకొని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని మార్పులు చేయాలనీ వెంకీ సూచించినట్లు సమాచారం.

 

ప్రతిరోజు దర్శకుకి క్లాస్ తీసుకుంటున్న వెంకీ ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత సెట్స్ పైకి వెళదామని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ఎండింగ్ కి వచ్చినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్  స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వెంకీ ప్లాన్ చేసుకుంటున్నాడు.