ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. అనే డైలాగ్ వెంకటేష్ కి కరెక్ట్ గా సెట్టవుతుంది. ఎందుకంటె మల్టీస్టారర్ సినిమాలో నటించడానికి ఎల్లప్పుడు ఈగో లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరో. రామానాయుడు లాంటి ఫ్యామిలీ బ్యాంక్ గ్రౌండ్ ఉన్నప్పటకి ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా స్నేహ పూర్వకంగా ఉంటారు.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. వేంకటేష్ ఈ సారి మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకిమామ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ గా వెంకిమామ డిసెంబర్ 13న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మామ అల్లుళ్ళ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే సినిమాలో వెంకటేష్ కంటే నాగ చచైతన్య పోర్షన్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

ఎందుకంటె ఇటీవల దర్శకుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కథను వెంకటేష్ కి చెప్పినప్పుడు చైతు పాత్ర ఎందుకు ఇంత తక్కువగా ఉందని అడిగారట. కానీ అప్పటికి దర్శకుడు పూర్తి కథను సిద్ధం చేయలేదట. ఆ తరువాత కథను పెంచే క్రమంలో వెంకీ దగ్గరుండి మేనల్లుడి పాత్రను సినిమా నిడివిలో పెంచారట. చైతూకు సంబందించిన సీన్ల కోసం వెంకీ సీన్లు చాలా వరకు ఎడిటింగ్ లో కట్ చేశారట.

అందుకు వెంకీ కూడా  ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. నాకన్నా ఈ సినిమా చైతూకి మంచి క్రేజ్ తేవాలని అతని కెరీర్ లో మంచి సినిమాగా వెంకీ మామ నిలవాలని వెంకీ బాబీతో చెప్పాడట.  రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా వెంకీ చైతుకి ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని కోరుకున్నాడు. మరి ఈ సినిమాతో చైతు ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.