Asianet News TeluguAsianet News Telugu

రివ్యూలపై మండిపడ్డ 'వెంకీ మామ' యుఎస్ డిస్ట్రిబ్యూటర్

మెరికా వంటి చోట్ల ఎక్కువ శాతం రివ్యూలు చూసి సినిమాలకు వెళ్తున్నారు. చాలా దూరం ప్రయాణించి సినిమాకు వెళ్లాల్సిన రావటం, టిక్కెట్ రేట్లు వంటివి ఆ పరిస్దితి అక్కడ క్రియేట్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో రివ్యూలను పరిగణనలోకి తీసుంటూంటారు. అయితే ఇలా రివ్యూలను చూసి సినిమాలకు వెళ్లటం అనేది నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు ఇష్టం ఉండదు. 

Venkatesh's Venky Mama US DISTRIBUTOR UPSET WITH  Reviews
Author
Hyderabad, First Published Dec 16, 2019, 7:56 AM IST

రివ్యూలు ఎంత వరకూ ప్రభావం చేస్తున్నాయి అనేది ఖచ్చితమైన లెక్కలు లేకపోయినా కొంత వరకూ ప్రభావితం చేస్తున్నాయనేది నిజం. ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల ఎక్కువ శాతం రివ్యూలు చూసి సినిమాలకు వెళ్తున్నారు. చాలా దూరం ప్రయాణించి సినిమాకు వెళ్లాల్సిన రావటం, టిక్కెట్ రేట్లు వంటివి ఆ పరిస్దితి అక్కడ క్రియేట్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో రివ్యూలను పరిగణనలోకి తీసుంటూంటారు. అయితే ఇలా రివ్యూలను చూసి సినిమాలకు వెళ్లటం అనేది నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు ఇష్టం ఉండదు. సినిమా తీసేవాడికి, చూసే వాడికి మధ్య రివ్యూలు ఏమిటి అనేది వారి అభిప్రాయం. అయితే చాలా సందర్బాలలో రివ్యూలు సినిమాల విజయానికి బాగా ప్లస్ అవుతాయి. అప్పుడు ఎవరు పట్టించుకోరు.

 కానీ ఎప్పుడైతే నెగిటివ్ రివ్యూలు వస్తాయో అప్పుడే కోపం వస్తూంటుంది. ఇప్పుడు అదే  'వెంకీ మామ'కు జరుగుతోంది. ఈ సినిమా యుఎస్ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ రివ్యూలపై చాలా కోపంగా ఉన్నారు. ఈ విషయం తమ సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా తెలియచేసారు. వెబ్ సైట్ రివ్యూలు తమ సినిమాపై ఇంపాక్ట్ చూపటం లేదని, అమెరికాలో జనం థియోటర్స్ కు వస్తున్నారని అన్నారు. అలాగే మౌత్ టాక్ తమ సినిమాకు బాగా పని చేస్తోందని, అన్ని చోట్లా హౌస్ ఫుల్ అవుతోందని చెప్పారు. 

నిజ జీవీత మామా అల్లుళ్లైన వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’ . కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్స్. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.  డిసెంబర్‌ 13 అంటే నిన్న వెంకటేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌  అయ్యింది. 

మామా అల్లుళ్ల మధ్య అనుబంధం ప్రధానంగా భావోద్వేగాలు, ఫన్నీ సన్నివేశాలతో రూపొందిన సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో వెంకీకి జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌, చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా సందడి చేశారు. తమన్‌ బాణీలు అందించారు. ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రల్లో కనిపించారు.

ఈ వీకెండ్ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. వెంకీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ‘ఎఫ్‌ 2’, చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘మజిలీ’ని మించి ‘వెంకీ మామ’ వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ రోజు నుంచే ఈ సినిమాకు అసలు పరీక్ష ప్రారంభం కానుంది.

పెద్ద బ్యానర్, ఫ్యామిలీలను టార్గెట్ చేసిన సినిమా కాబట్టి  వీకెండ్ కూడా  నడిచిపోయే అవకాసం ఉందని  ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరో ప్రక్క  పెద్ద సినిమాలు ఏవి పోటీగా లేకపోవడం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. అయితే వచ్చే శుక్రవారానికి రూలర్, దొంగ, ప్రతిరోజు పండగ చిత్రాలు వరస రిలీజ్ లు ఉండటంతో వాటికి  ఏ మాత్రం పాజిటివ్ టాక్ ఉన్నా.. ఆ ప్రభావం వెంకీ మామపై పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి వెంకీ మామ ఈ వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని రాబట్టాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios