2019లో మల్టీస్టారర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది మాత్రం సింగిల్ గానే రెడీ అవుతున్నాడు. ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా నారప్ప అనే తమిళ్ రీమేక్ సినిమాతో సిద్దమవుతున్నాడు.  తమిళ్ లో ధనుష్ చేసిన అసురన్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న నారప్ప సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. వెంకిమామ సినిమాకంటే ముందే వెంకీ తరుణ్ భాస్కర్ తో ఒక సినిమా చేయాలనీ అనుకున్నాడు. కానీ అప్పటికి ఫుల్ స్క్రిప్ట్ రెడీ కాకపోవడం వల్ల ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయలేకపోయాడు.  ఆ సినిమా క్యాన్సిల్ అయినట్లు టాక్ కూడా వచ్చింది. అయితే రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం తరుణ్ ఇటీవల ఫుల్ స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.  పూర్తి కథను విన్న వెంకటేష్ షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే ఆ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. హార్స్ రేస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించనున్నారట.

ఇక త్వరలోనే ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ సినిమాతో పాటు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది. నేను లోకల్ దర్శకుడు త్రినాథ రావు నక్కినతో ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్నారు.  అలాగే త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేయనున్నట్లు గతంలో ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక తేజతో చేయాల్సిన ప్రాజెక్ట్ పట్టాలెక్కిన కొన్ని రోజులకే ఆగిపోవడంతో తేజతో మరో కొత్త తరహా సినిమా చేయాలనీ అనుకున్నారు. కానీ వెంకీ మాత్రం ఎవరు ఊహించని విధంగా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. నారప్ప ప్రాజెక్ట్ కూడా ఇటీవల అనుకున్నదే. మరీ ఈ సినిమాతో విక్టరీ హీరో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.