నాగచైతన్య - వెంకటేష్ కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెంకిమామ నేడు గ్రాండ్ గాప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొన్ని నెలలుగా రిలీజ్ కి ఇబ్బందులు పడుతున్న ఈ సినిమా ఎట్టకేలకు సురేష్ బాబు అంతిమ నిర్ణయంతో వెంకటేష్ పుట్టినరోజు సందర్బంగా విడుదలవుతోంది. ఇక మొదటి నుంచి సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతూ వస్తోంది.

మొదట పలు దేశాల్లో ప్రీమియర్స్ తో మొదలైన ఈ సినిమాకు సంబందించిన టాక్ అప్పుడే సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది.  ఇక వెంకిమామ పిమియర్స్ ను చూసిన అభిమానులు ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ కామెడీ సన్నివేశాలతో కొనసాగే ఈ వెంకిమామ చాలా వరకు సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ ఫీల్ ని కలిగిస్తుందట.

అలాగే వెంకిమామ ప్రేమ - నాగ చైతన్య ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయని బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ హిట్ గ్యారెంటీ అని అంటున్నారు. ఇక మరికొందరైతే వెంకిమామలో వెంకీ పాత్రను పూర్తిగా ఎలివేట్ చేయలేదని నాగ్ చైతన్య పాత్ర ఇంకా స్ట్రాంగ్ గా చుపించాల్సింది అని అంటున్నారు.  ఆడియెన్స్ నుంచి పలు రకాల భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.

మొత్తంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ - సెకండ్ హాఫ్ బిలో యావరేజ్ అనే టాక్ ఎక్కువగా వైరల్ అవుతోంది. కొన్ని సీన్స్ లో మాత్రం వెంకటేష్ పెర్ఫెమెన్స్ అద్భుతంగా ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇంటర్వెల్ సీన్స్ చాలా బావున్నాయని సెకండ్ హాఫ్ చాలా స్ట్రాంగ్ గా స్టార్ట్ అయినప్పటికీ అదే ఫ్లోను దర్శకుడు కంటిన్యూ చేయలేకపోయాడని చెబుతున్నారు. మిక్సిడ్ టాక్ తో సోషల్ మీడియా నుంచి రెస్పాన్స్ అందుకుంటున్న వెంకిమామ మొదటి రోజు ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించగా థమన్ సంగీతం అందించారు.