విక్టరీ హీరో వెంకటేష్ గత ఏడాదిని సక్సెస్ తో మొదలు పెట్టి ప్లాప్ తో ఎండ్ కార్డ్ పెట్టాడు. చాలా కాలం తరువాత F2 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న వెంకీ అనంతరం వెంకిమామతో ఊహించని అపజయాన్ని అందుకున్నాడు. మల్టీస్టారర్ సినిమాలతో  2019లో హడావుడి చేసిన వెంకీ ఇక నెక్స్ట్ ఇయర్ సింగిల్ హీరోగా ప్రయోగాలు చేయడానికి సిద్దమవుతున్నాడు.

సక్సెస్ అందుకున్నాడు. ఇక అదే రేంజ్ లో 2020ని కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలని ప్లాన్ చేసుకుంటున్న వెంకీ మొదట అసురన్ రీమేక్ సినిమాతో రాబోతున్నాడు. షూటింగ్ కోసం చిత్ర యూనిట్ తో కలిసి అనంతపూర్ కూడా వెళ్ళాడు. ఎక్కువగా ఆ లొకేషన్స్ లోనే సినిమాని తెరకెక్కించబోతున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు నారప్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఇంకా రెండు మూడు టైటిల్స్ డిస్కర్షన్స్ లో ఉన్నప్పటికీ వెంకీ ఆలోచన మేరకు ఇదే టైటిల్ బెటర్ అని దర్శకుడు డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే సినిమాలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2006లో పెళ్ళైన కొత్తలో సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైన ఈ బ్యూటీ అనంతరం యమదొంగ సినిమాతో అప్పట్లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది.