మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా వెంకటేష్ మాత్రం ముందుటారని చెప్పవచ్చు. వేరే హీరోలతో స్క్రీన్ చేసుకోవడం అంటే చాలా వరకు హీరోలు తెగ ఆలోచిస్తారు. కానీ కథ నచ్చితే వెంటనే ఒప్పేసుకోవడం వెంకీకి అలవాటే. సీనియర్స్ జూనియర్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క హీరోతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

మేనల్లుడు నాగచైతన్య తో కలిసి వెంకీ నటించిన వెంకిమామ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెగ్యులర్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న వెంకీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ తరం జనరేషన్ తో కూడా మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు చేయాలనుందని చెప్పారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ - రామ్ చరణ్ వంటి హీరోలతో వర్క్ చేయడానికి రెడీ ఉన్నట్లు చెప్పారు.

మంచి కథ దొరికితే వారితో నటిస్తానని చెబుతూ.. నేటి తరం యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ ఎవరు వచ్చిన మల్టీస్టారర్ చేయడానికి సిద్దమే అని బలంగా చెప్పారు.  ఇదివరకే వెంకీ రామ్ - మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - వరుణ్ తేజ్ డిఫరెంట్ మల్టీస్టారర్ సినిమాలు చేసి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి మొదటి సారి ఫుల్ లెన్త్ రోల్ లో కథానాయకుడిగా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో వెంకీ మేనల్లుడి కోసం తన పాత్రకు సంబందించిన సన్నివేశాలను చాలా వరకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా తన సోదరి కొడుక్కి సాలిడ్ హిట్ ఇవ్వాలని కృషి చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సురేష్ బాబు నిర్మించగా థమన్ సంగీతం అందించారు. ఇక వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా.. నాగ చైతన్యకు జోడిగా రాశి ఖన్నా నటిస్తోంది.