అక్కినేని అభిమానులు - దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వెంకిమామ ఫైనల్ గా నేడు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా వెంకటేష్ - నాగ చైతన్య ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నేడు వెంకటేష్ పుట్టినరోజు కావడంతో రెండు పండగలు ఒకేరోజు వచ్చినంత ఆనందంగా అభిమానుల్లో సందడి నెలకొంది.

ఇక యూఎస్ లో సినిమాకు సంబందించిన ప్రీమియర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా షార్ట్ రివ్యూ విషయానికి వస్తే.. సినిమాలో వెంకటేష్ స్క్రీన్ ప్రజెన్స్ మెయిన్ హైలెట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక నాగ చైతన్య పాత్ర నిడివి ఎక్కువగానే ఉన్నప్పటికి వెంకటేష్ కి సంబందించిన ఎపిసోడ్స్ సినిమాలో ఎక్కువగా పేలాయి. ఫస్ట్ హాఫ్ మొత్తంగా బాగానే ఉన్నప్పటికీ దర్శకుడు సెకండ్ హాఫ్ సీన్స్ ని అనుకున్నంత రేంజ్ లో ప్రజెంట్ చేయలేకపోయాడు.  ఇక నాగ చైతన్య - వెంకీ మధ్య ఎమోషనల్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి.

కానీ యాక్షన్ డ్రామా సీన్స్ రొటీన్ గానే ఉంన్నాయి. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ సోసో గానే నడిచింది. అక్కడక్కడా కామెడీ సన్నివేశాలు అలాగే ఫైట్ సీన్స్ సినిమాకు బూస్ట్ ఇచ్చాయి. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చితక్కొట్టినప్పటికీ సాంగ్స్ విషయంలో అనుకున్నంతగా మెప్పించలేకపోయాడు. మొత్తంగా సినిమా యావరేజ్ టాక్ తో ప్రీమియర్స్ ని మొదలుపెట్టింది. అయితే వెంకీ ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సినిమా ఈ వారం మంచి ఓపెనింగ్స్ ని అందుకునే ఛాన్స్ ఉంది.  

మరి సినిమా ఏ స్థాయిలో ఓపెనింగ్స్ ని అందుకుంటుందో చూడాలి. యూఎస్ లో ప్రీమియర్స్ టికెట్లు గట్టిగానే అమ్ముడయ్యాయి. ఇక చాలా రోజుల తరువాత వచ్చిన మల్టీస్టారర్ కాబట్టి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వెంకిమామ బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు.