ధృవ,సైరా చిత్రాలతో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు దర్శకుడు సురేంద్రరెడ్డి. సైరా సక్సెస్ తర్వాత ఆయన ఏ చిత్రం కమిటవ్వలేదు. రకరకాల చిత్రాల జరుగుతున్నాయి. ప్రభాస్ తో ఆయన మరో ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ప్రభాస్ ..సినిమా చేద్దాం కానీ మరో సంవత్సరం వెయిట్ చెయ్యాలని అన్నారు.

దాంతో ఓ సంవత్సరం పాటు ఖాళీగా ఉంటే, అప్పటికి సైరా ని అందరూ మర్చిపోతారు. ఇప్పుడున్న క్రేజ్ అప్పటికి ఉండదు. అందుకే ఇమ్మీడియట్ గా సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకు సరైన హీరో ఎవరు...ప్రస్తుతం ఫామ్ లో ఉన్న స్టార్స్ అంతా వరసగా మినిమం మూడు ప్రాజెక్టులు ఓకే చేసి కూర్చున్నారు.  

ఈ నేపధ్యంలో ఆయనకు వరుణ్ తేజ తో ముందుకు వెళ్తే ఎలా ఉంటుందనిపించింది. అటు ఫిదా వంటి లవ్ స్టోరీ, ఇటు గద్దలకొండ గణేష్ వంటి మాస్ సినిమా.ఎఫ్ 2 వంటి కామెడీ సినిమా చేసి ఆల్ రౌండర్ అనిపించుకున్న వరుణ్ తేజ తన సబ్జెక్ట్ కు సరైన న్యాయం చేస్తారనిపించింది. దానికి తోడు తన సబ్జెక్టు పూర్తిగా యాక్షన్ తో కూడింది.

అందుకు తగ్గ ఎత్తు,పొడువు ఉన్నవాడు..మరీ ముఖ్యంగా మెగా క్యాంప్ కు చెందిన వాడు . ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రామ్ చరణ్ సలహా మేరకు వరుణ్ తేజ తో సినిమా చెయ్యాలని భావిస్తున్నారట. ప్రభాస్ కు అనుకున్న కథని వరుణ్ తేజ తో చేసే ఉద్దేశ్యంతో మీటింగ్ లు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

మరో ప్రక్క వరుణ్ తేజ..ఓ కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటితో ఓ చిత్రం ప్లాన్ చేసారు. అయితే సురేంద్రరెడ్డి కే ఫస్ట్ ప్రయారిటి ఇస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నవి అనుకున్నట్లు సెట్ అయితే త్వరలోనే అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాసం ఉంటుంది.