కంచె, అంతరిక్షం లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న వరుణ్ ఫిదా, తొలి ప్రేమ లాంటి రొమాంటిక్ హిట్స్ అందుకున్నాడు. మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2 కూడా చేశాడు. ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రంతో వరుణ్ తేజ్ కు మాస్ లో కూడా ఇమేజ్ పెరిగింది. 

ఇప్పుడు దర్శకులు వరుణ్ తేజ్ తో అన్ని ఎలాంటి సినిమా అయినా చేయొచ్చు. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలతో పాటు కమర్షియల్ చిత్రాలతో కూడా వరుణ్ సక్సెస్ అయ్యాడు. దీనితో దర్శక నిర్మాతలంతా వరుణ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. వరుణ్ నటించిన చిత్రాలతో నిర్మాతలకు మంచి లాభాలు వస్తున్నాయి. 

తన మార్కెట్ పెరిగిన నేపథ్యంలో వరుణ్ తేజ్ కూడా రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. గద్దలకొండ గణేష్ చిత్రం వరకు వరుణ్ తేజ్ పారితోషికం 3 నుంచి 4 కోట్ల వరకు ఉండేది. గద్దలకొండ గణేష్ హిట్ అయింది. దీనితో వరుణ్ తన తదుపరి చిత్రం నుంచి 7 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

వరుణ్ తేజ్ ప్రస్తుతం టాప్ లీగ్ హీరోలకు అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. మరో రెండు సాలిడ్ హిట్స్ పడితే వరుణ్ స్టార్ హీరోగా మారిపోవడం ఖాయం. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ పెంచినప్పటికీ అతడి చిత్రాలకు మంచి మార్కెట్ ఉన్న కారణంగా నిర్మాతలు వరుణ్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 

వరుణ్ తేజ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు. బాక్సింగ్ బ్యాగ్ డ్రాప్ లో సాగే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోంది. డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఈ చిత్రం కోసం బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.