మెగా హీరో వరుణ్ తేజ్ వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫిదా - తొలిప్రేమ - F2 - గడ్డలకొండ గణేష్ సినిమాలు ఈ మెగా వారసుడి మార్కెట్ ను ఒక్కసారిగా పెంచేశాయి. వరుణ్ తో సినిమా చేస్తే మిమినమ్ కలెక్షన్స్ అందుతాయని నిర్మాతలకి నమ్మకం కూడా వచ్చేసింది.

ఇప్పుడు వరుణ్ లాంటి హీరోతో సినిమా చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  ఇకపోతే తన సినిమా ద్వారా నష్టపోయిన ఒక నిర్మాతకు మరోసారి సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కంచె సినిమాలు నిర్మించిన రాజీవ్ రెడ్డి వరుణ్ తో అంతరిక్షం సినిమాను నిర్మించాడు. ఆ రెండు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికి కమర్షియల్ గా మాత్రం అనుకున్నంతగా లాభాలని ఇవ్వలేకపోయాయి.

ముఖ్యంగా అంతరిక్షం సినిమా చాలా వరకు నష్టాలనుమిగిల్చింది.  ఇటీవల వరుణ్ ని కలిసిన రాజీవ్ మరో సినిమా చేయడానికి ఒప్పించారట. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెస్సేజ్ ఉండేలా ఒక కథను సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియలేదు.

కానీ వరుణ్ తేజ్ మాత్రం రాజీవ్ తో ఒక హిట్టు సినిమా చేయాలనీ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.  త్వరలోనే వరుణ్ కొత్త సినిమాకు సంబందించిన అప్డేట్ ఈ నిర్మాత ఎనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. ఇక హరీష్ శంకర్ తో గద్దల కొండ గణేష్ అనంతరం కొత్త దర్శకితో సినిమా చేయడానికి ఒప్పుకున్న వరుణ్ అందులో బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో వరుణ్ సరికొత్త ఫిట్ నెస్ తో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది.