మెగా బ్రదర్ నాగబాబు మంగళవారం రోజు 58వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఏఈ సందర్భంగా సోషల్ మీడియాలో నాగబాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమ తండ్రి బర్త్ డే సందర్భంగా వరుణ్ తేజ్, నిహారిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్స్ పెట్టారు. 

హ్యాపీ బర్త్ డే నాన్న.. నీ ముఖంలో చిరునవ్వు కోసం మనం మేం ఏమైనా చేస్తాం. ఇంతటి అద్భుతమైన జన్మనిచ్చినందుకు ధన్యవాదాలు. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం అని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. తన తండ్రితో దిగిన అందమైన ఫోటోని షేర్ చేశాడు. 

నిహారిక కూడా సోషల్ మీడియాలో ఎమోషనల్ గా స్పందించింది. తన తండ్రి నుదుటిపై ముద్దిస్తున్న ఫోటోని షేర్ చేసింది. నాన్న నిన్నెంతగానో ప్రేమిస్తున్నాం. నీ ప్రేమని దాచుకోవడానికి నాకింకా పెద్ద హృదయం కావాలి. నా జీవితంలో ఇంతటి సంతోషానికి కారణం నువ్వే. గత జన్మలో నువ్వు తప్పకుండా నా కొడుకై ఉంటావు అని నిహారిక తన తండ్రిపై ప్రేమని తెలియజేసింది. 

ప్రస్తుతం నిహారిక, వరుణ్ తేజ్ నాగబాబుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగబాబు జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు టివి రంగాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, నిహారిక నటులుగా రాణిస్తూ ప్రయోజకులు అయ్యారు. దీనితో నాగబాబు ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆయన కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిసాయి.