కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. చివరి వీక్ దగ్గర పడుతున్న నేపథ్యంలో  హౌస్ లో ఎవరు మిగులుతారు, ఫైనల్స్ కు వెళ్ళేది ఎవరు, విజేత ఎవరు లాంటి ఉత్కంఠ ప్రశ్నల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. 

ఆదివారం రోజు ఎపిసోడ్ పై అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ వారం అందరూ నామినేట్ అయ్యారు. శనివారం రోజు ఇంటి సభ్యులలో బాబా భాస్కర్, రాహుల్, శ్రీముఖి సేవ్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఇక మిగిలిన వరుణ్, వితిక, అలీ రెజా, శివజ్యోతిలలో ఎలిమినేట్ అయ్యేది ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 

వితిక ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. దీనితో బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని రోజులు అలరించిన జంట వరుణ్, వితిక విడిపోయినట్లయింది. ఆదివారం రోజు అందరికంటే ముందుగా శివజ్యోతి సేవ్ అయింది. స్టోర్ రూమ్ నుంచ్చి తెప్పించిన కుండలని నాగ్ నామినేషన్ లో ఉన్నవారిచేత పగలగొట్టించారు. అందులో ఉన్న కాయిన్స్ పై శివజ్యోతి పేరు వచ్చింది. దీనితో శివజ్యోతి సేవ్ అయింది. 

ఆ తర్వాత అలీ రెజా, వరుణ్, వితికలకు నాగ్ కొన్ని కార్డ్స్ ఇచ్చారు. వాటిలో అలీ రెజా ఫోటో ఉండడంతో అతడు సేవ్ అయ్యాడు. ఇక చివరకు వరుణ్, వితిక నామినేషన్ మిలిగారు. నాగార్జున స్టేజిపై ఆంగ్ల అక్షరాలతో వరుణ్, వితిక పేర్లు ఉంచారు. ఎవరి పేరులో అక్షరం మిస్ అవుతుందో వారు ఎలిమినేట్ అయినట్లు. వితిక పేరు పూర్తి కాలేదు. దీనితో ఆమె ఎలిమినేట్ అయింది. 

వితిక ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్ ఎమోషనల్ అయ్యాడు. వితికని కౌగలించుకుని బాగా ఎమోషనల్ అయ్యాడు. వితిక కూడా కంటతడి పెట్టుకుంది. మిగిలిన హౌస్ మేట్స్ అంతా వితికని ఉత్సాహపరుస్తూ సెండాఫ్ ఇచ్చారు. 

అంతకు ముందు నాగార్జున ఇంటిసభ్యులతో పలు వినోదాత్మక టాస్క్ లు చేయించారు. శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతి డాన్స్ ఆకట్టుకుంది.