Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి అయిన రెండేళ్లకే.. బాలీవుడ్ స్టార్ డివోర్స్ తీసుకోబోతున్నారా? వైరల్ గా మారిన ట్వీట్!

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun  Dhawan)  - నటాషా రెండేళ్ల కింద వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరు విడిపోతున్నట్టు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆయన ట్వీట్ సంచలనంగా మారింది.
 

Varun Dhawan Natasha  divorce news viral NSK
Author
First Published May 27, 2023, 3:42 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ పదేండ్లకు పైగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ ధావన్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయా సినీ ఫంక్షన్లకు కూడా హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎప్పుడూ ఏదోరకంగా ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. 

అయితే, వరుణ్ ధావన్ కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. రెండేళ్ల కిందనే వివాహం చేసుకున్న వరుణ్ ప్రస్తుతం డివోర్స్  తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 2021 జనవరి 24న ఫ్యాషన్ డిజైనర్, వరుణ్ ధావన్ లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ అయిన నటాషా దలాల్ (Natasha Dalal)ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి అయ్యి రెండేళ్లు దాటి నాలుగు నెలలు గడిచింది. సినీ ఫంక్షన్లు, పార్టీలకు జంటగా హాజరవుతూ సందడి చేసేవారు. 

తాజాగా ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. వరుణ్ ధావన్, నటాషా దలాల్ మధ్య అంతగా బాగాలేదని, త్వరలో సెపరేట్ కాబోతున్నారని ట్వీట్ చేశారు. దీంతో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మరోవైపు సంధు సినీ సెలబ్రెటీల గురించి సెన్సేషనల్ కామెంట్స్  చేస్తుంటారు. పబ్లిసిటీ కోసమే ఇలా చేశాడా? లేదా నిజమా అన్నది తెలియదు? పలువురు నెటిజన్లు, ఫ్యాన్స్ మాత్రం ఇందులో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేస్తున్నారు. దీనిపై వరుణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక వరుణ్ ధావన్ తాజాగా iifa2023 వేడుకల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. తన డాన్స్ తో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే.. గతేడాది ‘తోడేలు’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ‘బావల్’లో నటిస్తున్నారు. మరోవైపు క్రేజీ సిరీస్ ‘సిటాడెల్’లోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios