ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్‌ స్టార్ మహేష్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నట్టుగా ప్రకటించాడు మహేష్ బాబు. ఆ సమయంలో ప్రతీ వేడుకలోనూ మహేష్‌తో పాటు వంశీ పైడిపల్లి కూడా కనిపించాడు. అయితే సరిలేరు నీకెవ్వరు తరువాత సీన్ మారిపోయింది.

అప్పటి వంశీతో సినిమా ఉంటుందన్న మహేష్ ఆ సినిమాను పక్కన పెట్టేశాడు. అధికారికంగా ప్రకటించకపోయినా వంశీతో సినిమా ఆగిపోయినట్టుగా మీడియాకు లీకులు ఇచ్చాడు. అదే సమయంలో పరుశురామ్‌ దర్శకత్వంలో మహేష్ సినిమా అంటూ మరో న్యూస్ తెర మీదకు వచ్చింది. దీంతో వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న వార్తకు మరింత బలం చేకూరినట్టైంది. మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వంశీతో మహేష్ మరో సినిమా చేస్తాడని భావించినా సూపర్‌ స్టార్ మాత్రం షాక్‌ ఇచ్చాడు.

అయితే తాజాగా ఈ వార్తలపై వంశీ పైడిపల్లి స్పందించాడు. ఈ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో మహేష్ మూవీపై క్లారిటీ ఇచ్చాడు. తాను మహేష్‌తో సినిమా ఆగిపోలేదని చెప్పాడు వంశీ. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన వర్క్ జరుగుతుందన్న వంశీ, మహేష్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే అని మాత్రం చెప్పలేదు. అదే సమయంలో మహేష్ తో మూవీ కోసం అభిమానుల్లాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా అంటూ చెప్పాడు వంశీ పైడిపల్లి.