హిప్పీ ఫేమ్ హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలు అందుకుంటోంది. బుల్లితెరపై రాణించిన దిగంగన ప్రస్తుతం వెండితెరపై సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. దిగంగన నటించిన తాజా చిత్రం వలయం. 

రమేష్ కుడుముల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లక్ష్య చదలవాడ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. కథానుగుణంగా దిగంగన రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో దిగంగన పాత్ర పేరు దిశ. 

రామ్ చరణ్ ఐటమ్ బ్యూటీ రచ్చ.. బోల్డ్ ఫోజులు తట్టుకోగలరా!

హీరోతో లవ్, పెళ్లి సన్నివేశాలని ట్రైలర్ లో చూపించారు. ఆ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరో పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భార్య దిశా కనిపించడం లేదు అని ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు ఈ కేసుని విచారణ జరిపే సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉండబోతున్నాయి. 

విచారణలో భాగంగా 'నువ్వే దిశాని ఏదో చేశావ్' అంటూ అనుమానించే సన్నివేశాలు సినిమాపై మరింతగా  ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి 21న తీసుకురానుంది. ట్రైలర్ పై ఓ లుక్కేయండి..