టాలీవుడ్ లో ఒకప్పుడు సక్సెస్ ఫుల్ రైటర్ గా కొనసాగిన వక్కంతం వంశీ ఊహించని విధంగా మాయమయ్యారు. దర్శకుడిగా వేసిన మొదటి అడుగు చేదు అనుభవాన్ని ఇవ్వడంతో వంశీ ఆ తరువాత పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోయాడు. నా పేరు సూర్య అల్లు అర్జున్ కెరీర్ లో ఊహించని డిజాస్టర్ గా నిలిచింది.

ఇక ఆ తరువాత మళ్ళీ రైటర్ గా తన రెగ్యులర్ జాబ్ లోకి వంశీ రానున్నట్లు టాక్ వచ్చింది.  ఇకపోతే నెక్స్ట్ వంశీ శాండిల్ వుడ్ సైడ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు టాక్ వస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దర్శన్ తో ఒక సినిమాను డైరెక్ట్ చేసేందుకు వంశీ రెడీ అవుతున్నట్లు సమాచారం. నా పేరు సూర్య డిజాస్టర్ అనంతరం వక్కంతం వంశీ కొంత మంది మీడియం రేంజ్ హీరోలకు  కథలని వినిపించినప్పటికీ పట్టించుకోలేదట.

ఇక ఫైనల్ గా వంశీ ప్రతిభ గురించి  తెలిసిన కన్నడ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ నిర్మాత దర్శన్ తో ప్రాజెక్ట్ ని సెట్ చేయించాడట. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలిపించినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని త్వరలోనే వక్కంతం వంశీ న్యూ ప్రాజెక్ట్ పై ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఆ సినిమాతో వంశీ ఎంతవరకు రికవర్ అవుతాడో చూడాలి.