అశోక్, రేసుగుర్రం,ఎవడు,టెంపర్ వంటి చిత్రాలకు కథలు అందించిన స్టార్ రైటర్ వక్కంతం వంశీ. టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా వెలుగొందిన వంశీ  నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో డైరెక్టర్ గా టర్న్ అయ్యారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవటంతో పూర్తిగా వెనకబడ్డాడు. ఒకప్పుడు స్టార్ హీరోలంతా వంశీ కథల కోసం వెయిట్ చేసేవారు.

అలాంటిది ఇప్పుడు వంశీ కథ చెప్పాలంటే దర్శకత్వం చేస్తానంటాడు అని వెనకడుగు వేస్తున్నారు. దానికి తోడు డైరక్టర్స్ ఎక్కువ, హీరోలు తక్కువ అవటంతో ఆఫర్స్ తక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో అటు కథలు ఇవ్వక, డైరక్షన్ చేయక వంశీ ఏం చేస్తున్నారు అనేది అందరిలో మెదిలే ప్రశ్న. 


ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం వక్కంతం వంశీ...గీతా ఆర్ట్స్ బ్యానర్ లో స్క్రిప్ట్ అనలిస్ట్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. గత రెండేళ్ళుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే పనిచేస్తున్నట్లు సమాచారం. ఆ బ్యానర్ కు వచ్చే రచయితల కథలు వినటం,ఆ  కథల్ని అనలైజ్ చేస్తూ తగిన ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

యూఎస్ లో మరో రికార్డ్ అందుకున్న బన్నీ

ఆ విషయం బయిటకు ఎలా వచ్చింది అంటే...తాజాగా అల వైకుంఠపురములో సక్సెస్ మీటింగ్ లో భాగంగా జరిగిన వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం వంశీ నే అని చెప్పటం జరిగింది.వక్కంతం వంశీ పూనుకుని ఈ కథ పట్టాలు ఎక్కించాడని చెప్తున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల మధ్య కథ విషయమై ఓ టైమ్ లో స్పర్దలు వచ్చి, ప్రాజెక్టు ప్రక్కన పెడదామనుకున్నప్పుడు... వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి ఈ సినిమాని పట్టాల మీదకెక్కించే ప్రయత్నం చేసాడట.

రేసు గుర్రం వంటి హిట్ ఇచ్చిన వంశీ అంటే అల్లు అర్జున్ కు పూర్తి నమ్మకం. అందుకే అతని మాటపైనే సినిమా చేసారని తెలుస్తోంది. ఏదైమైనా అల వైకుంఠపురములో హిట్ అవటం వక్కంతం వంశీ కు కూడా బ్రేక్ వచ్చినట్లే.  త్వరలో గీతా ఆర్ట్స్ పై తన దర్శకత్వంలో  సినిమా చేసే అవకాసం ఉందంటున్నారు.