అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.. కానీ ఆలస్యం జరుగుతూనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లేకుంటే ఈపాటికి వకీల్ సాబ్ రిలీజ్ కూడా అయిపోయి ఉంటుంది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 

వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ ఇంకా 20 శాతం మిగిలి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వాలు నెమ్మదిగా లాక్ డౌన్ నిబంధనల్ని సడలిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్స్, రిలీజ్ లు కూడా జరిగేలా వెసులుబాటు కల్పించాలని చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు లాంటి ప్రముఖులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసిన సంగతి తెలిసిందే. 

సీఎం సినీ ప్రముఖుల రిక్వస్ట్ కు సానుకూలంగా స్పందించారు. దీనితో దిల్ రాజు జూన్ లో వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ ని తిరిగి ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ రావడం లేదు. థియేటర్స్ కు ప్రభుత్వాలు అనుమతి ఇస్తేనే సినిమాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. 

వకీల్ సాబ్ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నివేత థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.