మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం కానున్న మరో కుర్ర హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫస్ట్ సాంగ్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న చిత్ర యూనిట్ సినిమాపై  మంచి బజ్ క్రియేట్ చేసింది. సినిమాకు సంబందించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  సుకుమార్ ప్రొడక్షన్ లో తెరక్కుతున్న ఈ సినిమాను బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఉప్పెన ప్రాజెక్ట్ కి మంచి డీల్స్ దక్కుతున్నాయి. నైజాం హక్కుల్ని దిల్ రాజు 4కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మొదటి సినిమాతోనే మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్న వైష్ణవ్ సెట్స్ పై ఉండగానే వైష్ణవ్ తేజ్ మరో సినిమాని ఒకే చేసినట్లు తెలుస్తోంది.  అలా మొదలైంది - ఓ బేబీ వంటి హిట్ చిత్రాల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీలో నటించబోతున్నాడట.

మెగాస్టార్ కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉప్పెన సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది. కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ఆ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇకపోతే నందిని రెడ్డి డైరెక్షన్ లో చేయబోయే సినిమాను నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తెరపైకి  తేనుంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.