మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన మొదటి చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. మెగా హీరోలంతా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా అలాంటి సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. అతని మొదటి చిత్రానికి చిత్రానికి ఉప్పెన అనే టైటిల్ ని సెట్ చేశారు.

సుకుమార్ రైటింగ్స్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇక సినిమా రిలీజ్ డేట్ పై ఇటీవల చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో సమ్మర్ హాలిడేస్ కి సినిమాని రిలీజ్ చేయాలనీ సుకుమార్ టీమ్ డిసైడ్ అయ్యిందట. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాల డోస్ పెరిగింది.

మెగా హీరోలు పెద్దగా ప్రమోట్ చేయలేకపోతున్నప్పటికీ వైష్ణవ్ తేజ్ బాగానే క్రేజ్ అందుకున్నాడు. సినిమాకు సంబందించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే ఉప్పెన ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే వైష్ణవ్ తేజ్ మరో సినిమాని ఒకే చేసినట్లు తెలుస్తోంది. అలా మొదలైంది - ఓ బేబీ వంటి హిట్ చిత్రాల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీలో నటించబోతున్నాడట.

మెగాస్టార్ కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఉప్పెన సినిమా అనంతరం ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ఆ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఇకపోతే నందిని రెడ్డి డైరెక్షన్ లో చేయబోయే సినిమాను నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తెరపైకి తేనుంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.