కోలీవుడ్ సీనియర్ కమెడియన్ వడివేలు మరోసారి తన కామెంట్స్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కాయమవుతున్న సమయంలో సూపర్ స్టార్ పై సెటైర్లు వేసి హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు. రజినీకాంత్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారో ఆయనకే తెలియదని, అలాంటిది నేనెలా ఉహించగలని ఒక మీడియా ప్రతినిధికి ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చారు.

రీసెంట్ గా తిరుచెందూరు సుబ్రమణ్యస్వామివారి ఆలయాన్ని దర్శించుకున్న వడివేలు.. పూజారులు చేత ఘన స్వాగతం అందుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయం వెలుపల విలేఖరుల సమావేశంలో వడివేలు రాజకీయా అంశాలపై ఎదురైనా ప్రశ్నలకు ఎవరు ఊహించని విధంగా సమాధానం ఇచ్చారు.  రజిని రాజకీయాల గురించి మీరేమంటారని ఒక విలేకరి అడుగగా.. వడివేలు మాట్లాడుతూ.. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారో మీకు తెలియదు.. నాకు తెలియదు. అంతెందుకు రజినీకాంత్ ఐ కూడా తెలియదని ఎద్దేవ చేశారు.

అయితే రజినీకాంత్ చెప్పిన ఒక విధానం బాగుందని పార్టీకి, పాలనకు సంబంధం లేకుండా రెండు నాయకత్వాలు ఉండడం అనేది మంచి విషయం. దాన్ని నేను స్వాగతిస్తున్నాని అన్నారు. ఇక తాను సీఎం అవ్వాలని అనుకుంటున్నాని చెప్పిన వడివేలు.. మీరు నాకు ఓటేస్తారా అని విలేకరులను నవ్వుకుంటూ అడిగారు. అందుకు విలేకరులు సైతం తప్పకుండా ఓటేస్తామని చెప్పడంతో..  అయితే సీఎం నేనే అని వడివేలు మరో కామెంట్ చేశారు.