బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పుడూ ఏదో వార్తలో ఉండేందుకు ప్రయత్నిస్తూంటారు. తమకు బయిట క్రేజ్ ఉన్నంతవరకే తాము సినిమాల్లో వెలుగుతామని నమ్ముతూంటారు. దాంతో ఏదో ఒక కాంట్రవర్శీ కొని తెచ్చుకుంటూంటారు. అయితే ఆ వివాదం ముదిరితేనే ప్రమాదం. అలాంటి పరిస్దితే వాణికపూర్ తెచ్చుకుంది.

వాణి కపూర్ అంటే గుర్తు వచ్చిందా.. హీరో నానితో కలిసి ‘ఆహా కల్యాణం’లో సందడి చేసిన హీరోయిన్‌. ప్రస్తుతం వాణీ ఓ వివాదంలో చిక్కుకుని నెటిజన్ల ఆగ్రహానికి గురౌతోంది.  వాణీ కపూర్ .. ‘హే రామ్‌’ అంటూ రాసిన టాప్‌ జాకెట్‌ బికిని ధరించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అది చూసిన నెటిజన్లు చాలా తీవ్రమైన పదాలతో వాణీపై విరుచుకుపడుతన్నారు.

read also: టాలీవుడ్ లోకి రీఎంట్రీ.. రవితేజపై శృతి హాసన్ కామెంట్స్!

ఆ ఫోటో ఎప్పుడు ఎక్కడ తీసిందో కానీ...వాణీ తన ట్విట్టర్‌ స్టేటస్‌లో పెట్టుకుంది. అది చూసిన జనం..ముఖ్యంగా హిందువులు మండిపడ్డారు. ‘‘మీకు మతం మీద నమ్మకం లేకపోయినా, సంస్కృతి, సంప్రదాయలను గౌరవించక పోయినా ఫర్వాలేదు. కానీ ఇలాంటి డ్రెస్‌లు వేసుకొని మా మనోభావాలతో ఆడుకోవద్దంటూ’’ ఘాటుగా హెచ్చరిస్తూ..పోస్ట్ లు పెడుతున్నారు. దాంతో ఏదో కాస్తంత పబ్లిసిటీ వస్తుంది..నలుగురు చూస్తారనుకుంటే అది ఓ స్టేజ్ దాటి..నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిపోయింది.

దాంతో ఫస్ట్ లైట్ తీసుకున్నా...తర్వాత ఆమె దిగిరాక తప్పలేదు.  ఆ ఫొటోని ట్విట్టర్లో తొలిగించినా కూడా ఈ ఫోటోతో వాణీకి రావాల్సినంత బ్యాడ్ నేమ్ వచ్చేసింది. కొందరైతే మరొక అడుగు ముందుకు వేసి, ఆమె మన మతాన్ని అవమానించింది..ఆమె సినిమాలు చూడద్దు అని ప్రచారం మొదలెట్టారు. సరదా, ప్యాషన్‌ కోసం వేసుకొన్న డ్రెస్‌ కారణంగా వాణీ కపూర్‌కి సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ కు గురి అవటం మిగతా హీరోయిన్స్ కు కాస్త జాగ్రత్తగా ఉండాలనే సందేశం పంపినట్లైంది.

ఇక వాణీ ఈమధ్యనే హృతిక్‌ రోషన్, టైగర్‌ ష్రాఫ్‌లతో కలిసి ‘వార్‌’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం కరణ్‌ మల్హోత్రా దర్శకత్వంలో వస్తున్న ‘షమ్‌షేరా’లో వాణీ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇది 18 వ శతాబ్దానికి చెందిన యధార్ద కథ. అప్పటి పాలకులైన బ్రిటీష్‌ వారిని ఎదిరించే బందిపోటు తెగకు చెందిన పాయింట్  తో రూపొందుతోంది.