సంక్రాంతి సీజన్ లో సినిమాలో  ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో ఇటీవల మరోసారి రుజువయ్యింది. 'సరిలేరు నీకెవ్వరు' అంతగా బాలేకపోయినా కలెక్షన్స్ అయితే గట్టిగానే రాబట్టింది. ఇక పాజిటివ్ టాక్ అందుకున్న 'అల.. వైకుంఠపురములో' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకుంది. దీంతో సంక్రాంతి సీజన్ ఎంతగా కలిసొస్తుందో మరో సారి క్లారిటీ వచ్చింది.

అందుకే RRR షూటింగ్ పనులన్నీ అక్టోబర్ లోనే అయిపోతున్నా సినిమాని జనవరికి షిఫ్ట్ చేశారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మెగా నందమూరి అభిమానులు ఏ స్థాయిలో అంచనాల్ని పెంచుకుంటున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే RRR సినిమా వస్తున్నప్పటికీ మరో రెండు సినిమాలు సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ కూడా సంక్రాంతికి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం పింక్ రీమేక్ తో బిజీగా ఉన్న పవన్ ఆ తరువాత క్రిష్ తో వీరుపాకి అనే సినిమా చేయనున్నట్లు టాక్ వస్తోంది. ఎలాగైనా డిసెంబర్ లోగా షూటింగ్ పూర్తి చేసి 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక మరోవైపు F2 - సరిలేరు నీకెవ్వరు సినిమాలతో సంక్రాంతి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి F3 ని నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. RRR సినిమా ఉన్నప్పటికీ ఏ మాత్రం సందేహించకుండా కాన్సెప్ట్ మీద నమ్మకంతో సంక్రాంతికి రావాలని అనుకుంటున్నా ఈ రెండు సినిమాలు ఎంతవరకు పోటీని ఇస్తాయో చూడాలి.