ఫ్యాన్స్ ఉత్సాహంతో కొన్ని సినిమాలను రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నారు. కొందరి హీరోల సినిమాలు మాత్రం రీరిలీజ్ లో అసలు ఆడటం లేదు. 

తెలుగులో ఇప్పుడు రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. వరస పెట్టి స్టార్ హీరోల సినిమాలు అన్నీ రీ రిలీజ్ అవుతున్నాయి. రెగ్యులర్ సినిమాలు విడుదల కన్నా వీటికే క్రేజ్ ఎక్కువ ఉంటోంది. ప్యాన్స్ అంతా వీటి కోసమే ఎదురుచూస్తున్నారు. వారానికి ఒక రీరిలీజ్ అనౌన్స్ మెంట్.. పదిహేను రోజులకో సినిమా రిలీజ్ అవుతూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ ఉత్సాహంతో కొన్ని సినిమాలను రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నారు. కొందరి హీరోల సినిమాలు మాత్రం రీరిలీజ్ లో అసలు ఆడటం లేదు. ఇందులో డబ్బింగ్ సినిమాలు కూడా రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా డబ్బింగ్ మూవీ అయిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ రీ రిలీజ్ రికార్డ్ కలెక్షన్స్ సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మరిన్ని పాత సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. అవేమిటంటే..

#Yogi - ఆగస్ట్ 18th
#RaghuvaranBtech - Augustఆగస్ట్ 18th
#GudumbaShankar4K - సెప్టెంబర్ 2nd
#SivajiTheBoss - డిసెంబర్ 15th
#Venky - డిసెంబర్ 30th
#7GBrundavanColony - త్వరలో..

 ఇక ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మేన్ మూవీ ఆగస్టు 09న రీ రిలీజ్ అవుతోంది. మరో ప్రక్క ప్రభాస్ చిత్రాల్లో ప్యూర్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా “యోగి” ని రీరిలీజ్ కు ముస్తాబు చేస్తోంది టీమ్. అయితే అప్పట్లో ఈ సినిమా వర్కవుట్ కాలేదు.ఈ చిత్రం అయితే ఈ ఆగస్ట్ 18న తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తూండటంతో ఏ మేరకు ఈ చిత్రం వర్కవుట్ అవుతుందా అనే ఆసక్తి సినీ అభిమానుల్లో కలుగుతోంది. గుడుంబా శంకర్ కూడా అప్పట్లో పెద్దగా వర్కవుట్ కాలేదు. సినిమా రిలీజ్ రోజే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది.

ఇలా అప్పుడు వర్కవుట్ కాని సినిమాలు ఇప్పుడు పనికట్టుకుని మరీ రీరిలీజ్ చేయటం ఎందుకు అని కొందురు సోషల్ మీడియాలో అడుగుతున్నారు. అయితే ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ఇప్పుడు రికార్డ్ లు క్రియేట్ చేస్తాయి చూడండి..`సూర్యా సన్నాఫ్ కృష్ణన్` సినిమా అప్పట్లో ఆడలేదు. డిజాస్టర్..ఇప్పుడు రీరిలీజ్ లో పెద్ద హిట్.. అలాగే...`ఈ నగరానికి ఏమైంది`.. అప్పట్లో అసలు ఆడలేదు. రీరిలీజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది..అలాగే ఈ సినిమాలకు జరగచ్చు అంటున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషనే జరుగుతోంది.