మెగా కోడలు ఉపాసన తన సింప్లిసిటీ, సేవ భావంతో అందరి హృదయాలు గెలుచుకుంటోంది. సోషల్ మీడియాలో ఉపాసన చాలా యాక్టివ్. సోషల్ మీడియా ద్వారా ఉపాసన నెటిజన్లకు ఆరోగ్య సూచనలు ఇస్తూ ఉంటుంది. 

తాజాగా లాక్ డౌన్ కారణంగా ఉపాసన కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టింది. తన ఫామ్ హౌస్ లో ఆధునిక వ్యవసాయానికి సంబంధించిన మెళుకువలు నేర్చుకుంటోంది. అంతే కాదు ఫామ్ హౌస్ లో ఉన్న ఆవులకు కుడితి, మేత పెడుతూ వాటితో ఆప్యాయంగా మేలుగుతోంది. 

 

అక్కడ ఉన్న ఆవు పేడని సైతం ఉపాసన ఎత్తివేసింది. ఈ దృశ్యాలని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఉపాసన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫిట్ నెస్, హెల్త్ విషయంలో నెటిజన్లకు విలువైన సూచనలు చేస్తూనే ఉంది. రాబోవు కాలంలో మనిషి బ్రతకగలిగేది సేంద్రియ వ్యవసాయం ద్వారా మాత్రమే అని ఉపాసన తన తాజా ట్వీట్ లో పేర్కొంది.