సినీ ప్రియులకు, నిర్మాతలు, దర్శకులు ఇతర చిత్ర పరిశ్రమకు కార్మికులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభవార్త తెలిపారు. చిత్ర పరిశ్రమ ఎప్పుడెప్పుడా ఎన్ని ఎదురుచూస్తున్న షూటింగ్స్ అనుమతి, థియేటర్స్ ఓపెనింగ్ పై ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్స్ ఓపెనింగ్ ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. 

దీనిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని కిషన్ రెడ్డి అన్నారు. తాజాగా కిషన్ రెడ్డి సినీ ప్రముఖులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి లాంటి సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి షూటింగ్స్ కు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

చీరలో సదా సెక్సీ ఫోజులు.. నడుము సొగసుతో మంటపెడుతున్న బ్యూటీ

ఆ సమావేశంలో  కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా థియేటర్స్ ఓపెనింగ్ గురించి మాట్లాడడంతో చిత్ర పరిశ్రమలో సంతోషం నెలకొంది. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ చేసుకుంటామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. 

కాశ్మీరు సహా దేశంలో ఎక్కడైనా షూటింగ్స్ జరిగేలా, స్టూడియోలు నిర్మించుకునేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందని కిషన్ రెడ్డి అన్నారు. చిత్ర పరిశ్రమపై భారంగా మారిన జీఎస్టీపై కూడా ఓ నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.