సాధారణంగా ఎలాంటి సినిమాను తెరకెక్కించిన కూడా మా సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాలని కోరుకునే మనస్తత్వం సినిమా వాళ్ళది. ముఖ్యంగా నటీనటులు సినిమాకు ప్రమోషన్స్ చేసే క్రమంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చితుందని చెబుతుంటారు. కానీ ఒక హీరో మాత్రం నా సినిమా ను ఓ వర్గం ఆడియెన్స్ చూడకూడదని డిఫరెంట్ గా చెబుతున్నాడు.

అతనెవరో కాదు.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్.గతంలో ఒరు కల్ ఒరు కన్నాడి' సినిమాను తెలుగులో 'OK OK' టైటిల్ తో రిలీజ్ చేసి ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షించాడు. ఆ తరువాత మళ్ళీ కనిపించని ఉదయనిధి తమిళ్ లో ఎన్ని సినిమాలు చేసినా సరైన సక్సెస్ అందుకోలేదు. అప్పుడపుడు రాజకీయాల్లో కొనసాగుతూ జనాలను ఆకర్షించాడు.

ఇక మొత్తానికి ఒక సైకో థ్రిల్లర్ సినిమాను సెట్ చేసుకున్న ఉదయనిధి ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయలనీ భావిస్తున్నాడు. అయితే ఆ సినిమాను చిన్న పిల్లలు, సున్నిత మనస్తత్వం గలవారు చూడకూడదని ఉదయనిధి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా చూడకూదని వివరించాడు. ఇంత దైర్యంగా చెబుతున్నాడు అంటే సినిమాలో థ్రిల్ చేస్తుందో అని ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది, మరీ ఈ రూట్ లో ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి.