ఆంధ్రాలో... ప్లెక్సీ కడుతూ,షాక్ కొట్టి ...హీరో సూర్య అభిమానులు మృతి
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్దానిక హాస్పటిల్ కు తరలించారు.

స్టార్ హీరో సూర్య అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం మోపువారిపాలెంలో విషాదం చోటు చేసుకొంది. తమిళ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడతుండగా కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు యువకులు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులు నక్క వెంకటేష్, పోలూరు సాయి అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్దానిక హాస్పటిల్ కు తరలించారు.
ఇక తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువ’. ఇవాళ సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ ను యూనిట్ విడుదల చేసింది. దీనిలో సూర్య సరికొత్త పాత్రలో కనిపించారు. పది భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి… దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా ఏకంగా 10 భాషల్లో విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. దాదాపు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూర్య కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా.