యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో భీష్మ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. హ్యాట్రిక్ ప్లాపులతో సతమతమవుతున్న నితిన్ కు భీష్మ చిత్రం ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం నితిన్ వెంకీ అట్లూరి దర్శత్వంలో రంగ్ దే అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది నితిన్ నటించబోతున్న మరో చిత్రం అంధాదున్ తెలుగు రీమేక్. ఈ చిత్రంపై నితిన్ చాలా ఆసక్తిగా ఉన్నాడు. బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే అంటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 

టాప్ లెస్ గా జల్సా హీరోయిన్ చెల్లి.. బికినీలో అక్కాచెల్లెళ్ల అందాలు వైరల్

ఈ చిత్రంలో నితిన్ కు హీరోయిన్ల సమస్య తెలెత్తుతోంది. అంధాదున్ చిత్రంలో ఘాటు రొమాంటిక్ సన్నివేశాలు, లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. కాబట్టి ఈ చిత్రంలో నటించే హీరోయిన్ బోల్డ్ సీన్లకు రెడీ అయిపోవాలి. అలాంటి హీరోయిన్ కోసం దర్శకుడు మేర్లపాక గాంధీ వేట మొదలు పెట్టాడు. 

ముందుగా కీర్తి సురేష్, గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ లాంటి హీరోయిన్లని సంప్రదించారట. కానీ లిప్ లాక్ సీన్లలో తాము నటించమని వీరిద్దరూ తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ అందాల ఆరబోతకు, ఇంటిమేట్ సన్నివేశాలకు దూరం. ప్రియాంక కూడా గ్యాంగ్ లీడర్ చిత్రంలో హోమ్లీగా నటించింది.