ప్రముఖ బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా ట్వింకిల్ ఖన్నానే ఈ వీడియోను పోస్ట్ చేసింది. ట్వింకిల్ ఖన్నా భర్త అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ట్వింకిల్ మాత్రం కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటోంది. నిర్మాతగా, రచయితగా రాణిస్తోంది. 

ఇటీవల ట్వింకిల్ ఖన్నా ముఖానికి పేపర్ అడ్డు పెట్టుకుని తన కారు వైపు పరుగులు తీస్తున్న వీడియో వైరల్ గా మారింది. తన ముఖాన్ని ఎవరికీ చూపించకుండా ట్వింకిల్ జాగ్రత్త పడింది. వెంటనే కారులోకి ఎక్కేసి అక్కడి నుంచి బయలుదేరింది. వీడియో గమనిస్తే అది షూటింగ్ ప్రదేశంలా కనిపిస్తోంది. 

 

స్వయంగా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ట్వింకిల్ ఖన్నా.. ముఖానికి పేపర్ అడ్డుపెట్టుకోవడానికి గల కారణాన్ని వివరించింది. తన కనుబొమ్మలకు ప్రత్యేకంగా మేకప్ వేసరట. త్వరలో బిగ్ రివీల్ ఉండబోతోంది అని ట్వింకిల్ పోస్ట్ చేసింది. 

బహుశా ట్వింకిల్ ఖన్నా న్యూ లుక్ లో కనిపిస్తుందేమో. ఈ పోస్ట్ తర్వాత మేకప్ తొలగించి నార్మల్ లుక్ లో ఇంట్లో కాఫీ తాగుతూ సేదతీరుతున్న సెల్ఫీ పిక్ ని కూడా ట్వింకిల్ ఖన్నా పోస్ట్ చేసింది. నటిగా గ్యాప్ తీసుకున్న ట్వింకిల్ ఖన్నా రచయితగా మాత్రం దూసుకుపోతోంది. ఆమె రాసిన రచనలకు బెస్ట్ సెల్లర్ అవార్డు కూడా అందుకుంది.