చెన్నై: తమిళనాడులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తమిళ సీరియల్స్ లో నటిస్తున్న శాంతి కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. చెన్నైలోని విరుగంబాక్కం నటేశన్ నగర్ ప్రాంతంలో గల ఐఎఎస్ అధికారుల క్వార్టర్స్ లోని ఓ ఇంటిలో జాకబ్ విలియం, శాంతి దంపతులు నివసిస్తున్నారు 

శాంతి మెట్టిఒళి తదితర సీరియల్స్ లో నటించారు. వారికి సంతోష్ (34), ప్రశాంత్ అనే ఇద్దరు కుమారులున్నారు. సంతోష్ కు వివాహమైంది. అయితే, భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. 

రాత్రి పది గంటలకు సంతోష్ ఇంటికి చేరుకున్నాడు. తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. గది నుంచి ఏ విధమైన శబ్దాలు కూడా రాకపోవడంతో సోదరుడు ప్రశాంత్ తెల్లవారు జామున ఆ గదిలోకి వెళ్లిచూశాడు. సంతోష్ శవమైన కనిపించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

విరుగంబాక్కం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్ి సంతోష మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు సంతోష్ మరణంపై పోలీసులు అతని తల్లిదండ్రులను, సోదురుడిని విచారిస్తున్నారు.