సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన ఆరోపణలు తరుచూ వినిపిస్తూనే ఉన్నాయి. టాప్ స్టార్స్‌ నుంచి అవకాశాలు లేని తారలు ప్రతీ ఒక్కరు కాస్టింగ్ కౌచ్‌ గురించి ఆరోపణలు చేసిన వారే. అంతేకాదు కొన్ని సందర్భాల్లో టాప్‌ స్టార్ల మీద కూడా ఇలాంటి సంబరాలు ఉన్నాయి. తాజాగా మరో నటి కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తెలుగులో అమృతం, నాన్న, అగ్నిసాక్షి లాంటి సూపర్‌ హిట్ సీరియల్స్‌లో నటించిన రాగిణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె పలు సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటించింది. తాజాగా ఈ నటి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది.ప్రస్తుతం పెద్దగా తెర మీద కనిపించిన ఈమె ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె పర్సనల్ లైఫ్‌తో పాటు ఇండస్ట్రీకి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా తన కుటుంబ నేపథ్యాన్ని వివరించింది రాగిణి. తమ తల్లి దండ్రులకు 13 మంది సంతానం అని అందులో తాను 12 సంతానమని తెలిపింది. నటిగా ప్రూవ్‌ చేసుకోవాలన్న ఉద్దేశంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. కెరీర్‌ స్టార్టింగ్ లో అవకాశాలు వచ్చిన వ్యక్తిగత సమస్యల కారణంగా సినిమాలు చేయలేకపోయిందట.

అయితే ఈ సందర్భంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై  స్పందించింది. సినీ రంగంలో ఎవరై,న తెలిసి వ్యక్తులను బాగున్నారా అని అడిగితే.. వాళ్లు  పై నుంచి కింద వరకు చూసి వస్తావా అని అడిగే వారిని ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొనని చెప్పిన రాగిణి, తెలిసిన వాళ్ల ద్వారా దూరదర్శన్‌ సీరియల్‌లో అవకాశం రావటంతో కెరీర్ గాడిలో పడిందని వెల్లడించింది.