టాలీవుడ్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ ఫైట్ లోకి ఆల్ రెడీ మహేష్ దూకేశాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా నేడు వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఇక నెక్స్ట్ కూడా అల్లు అర్జున్ అదే స్థాయిలో రంగంలోకి దిగబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ఆదివారం రిలీజ్ కాబోతోంది. అయితే సినిమాకు సంబందించిన బజ్ బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాపై కొంత నెగిటివ్ టాక్ వైరల్ అయ్యింది.

సినిమా రీ షూట్ చేశారంటూ కూడా రూమర్స్ వినిపించాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాపై క్రేజ్ మరింత పెరిగేలా దర్శకుడు త్రివిక్రమ్ ఒక స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు ఈ సినిమా స్పెషల్ షోని ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఆడియెన్స్ కంటే ముందుగానే RRR స్టార్స్ 'అల వైకుంఠపురములో' సినిమాని చూడనున్నారట.  RRR హీరోలు గనక సినిమాను చుస్తే సినిమాకి మరింతగా బూస్ట్ ఇచ్చినట్లే.

ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. సంక్రాంతి అసలైన హిట్టు పడిందని ఆడియెన్స్ రచ్చ మొదలుపెట్టారు. దీంతో ఈ సినిమాను ఎదుర్కోవాలంటే 'అల..వైకుంఠపురములో" సినిమా ఆడియెన్స్ అంచనాలకు మించి మెప్పించాలి. దానికి తోడు సినిమా కి ప్రమోషన్స్ డోస్ పెంచాలి. అందుకే త్రివిక్రమ్ కోరిక మేరకు ఎన్టీఆర్ - చరణ్ లు స్పెషల్ షోను చూడనున్నారట. మరీ ఈ ప్లాన్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.