ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్లు తమ సొంత ట్యూన్ లనే మళ్లీ మళ్లీ కంపోజ్ చేస్తూ దొరికిపోతున్నారు. తాజాగా దేవిశ్రీప్రసాద్ కూడా తను కంపోజ్ చేసిన పాటనే కాస్త అటు ఇటు చేసి మహేష్ బాబు కోసం వాడేశాడు. ఈ పాట విన్న నెటిజన్లు దేవిశ్రీని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటినుండే సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా సినిమాలో 'మైండ్ బ్లాక్' అంటూ సాగే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. దీనికి ఫ్యాన్స్ నుండి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఈ పాటని ట్రోల్ చేస్తున్నారు.

#Nani26: నాని కొత్త సినిమా టైటిల్ 'టక్ జగదీష్'!

 దేవిశ్రీ ఓ రేంజ్ లో మ్యూజిక్ కంపోజ్ చేసి ఉంటాడని ఆశించిన  అభిమానులకు నిరాశే ఎదురైంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ సైతం ఈ పాటపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ట్రోలింగ్ పేజీలు డీఎస్పీ ఈ పాటని ఎక్కడ నుండి తీసుకున్నాడో కనిపెట్టి పోస్ట్ లు పెడుతున్నాయి. 

దేవిశ్రీ సంగీతం అందించిన 'నేను శైలజ' సినిమాలో 'శైలజ శైలజ' అంటూ సాగే పాటని ఫాస్ట్ బీట్ లో కొడితే 'మైండ్ బ్లాక్' మ్యూజిక్ కి సింక్ అవుతుంది. దీనికి కొన్ని వీడియోలు జోడించి ట్రోల్ చేసిన విధానం ఫన్నీగా అనిపిస్తుంది. ట్రోలర్లు తమ క్రియేటివిటీని మొత్తం ఈ పాటపై వాడినట్లు ఉన్నారు.

ఈ సంగతి ఇలా ఉంటే యూట్యూబ్ లో మాత్రం ఈ పాట దాని సత్తా చాటుతోంది. ఇప్పటివరకు 5 మిలియన్లకు పైగా వ్యూస్ ని సాధించింది. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది.