టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చాలా రోజుల తరువాత మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నడు. గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్గెస్ట్ హిట్ అందుకొని తెలుగు ఇండస్ట్రీ మార్కెట్ స్థాయిని కూడా పెంచాడు. పాన్ ఇండియా ఫిల్మ్ కాకపోయిన్నటికి ''అల..వైకుంఠపురములో" 200కోట్ల నెట్ కలెక్షన్స్ తో టాప్ హిట్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. సంక్రాంతికి అసలైన విన్నర్ గా నిలిచిన ఈ సినిమా ఇతర ఇండస్ట్రీలలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

కుదిరితే రీమేక్ చేయాలనీ బాలీవుడ్ స్టార్ హీరోలు ఆలోచిస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే.. నెక్స్ట్ త్రివిక్రమ్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉందని మొన్నటివరకు రూమర్స్ గట్టిగా వినిపించాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ డేట్స్ ఇప్పట్లో దొరికేలా లేవు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR సినిమాలో తారక్ కొమురం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.  అయితే ఆ సినిమా షూటింగ్ ఇంకా అయిపోలేదు.

సమ్మర్ కి రిలీజ్ అవుతుందని అనుకున్న సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. దీంతో నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు ఎన్టీఆర్ దొరకడం కష్టమే. RRR ఫినిష్ అయ్యే వరకు తారక్ ఏ సినిమా ఒపుకోవద్దని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. దీంతో త్రివిక్రమ్ తో చేయాలనుకున్న సినిమాకి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. దీంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్రాజెక్టు కంటే ముందే చిన్న బడ్జెట్ లో ఒక సింపుల్ ఎమోషనల్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.