టాలీవుడ్ లో పేరున్న నిర్మాత అల్లు అరవింద్. నిర్మాణ రంగంలో అతడి అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన బ్యానర్ లో రూపొందించే సినిమాల విషయంలో అల్లు అరవింద్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ తెలివి గురించి తెలిసిందే.

రచయితగానే కాకుండా దర్శకుడిగా టాప్ రేసులో దూసుకుపోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో అల్లు అర్జున్ హీరోగా 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అరవింద్, త్రివిక్రమ్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినట్లు టాలీవుడ్ లో గుసగుసలువినిపిస్తున్నాయి.

అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే.. సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ఇలాంటి నేపధ్యంలో వారం రోజుల క్రితం అల్లు అరవింద్, బన్నీ వాస్ లు కలిసి సినిమా చూశారు. అప్పటికి సినిమా మూడు గంటల నిడివి ఉందని సమాచారం. సినిమా అంతా ఓకే కానీ, ఇంత నిడివి ఉంటే కష్టమని, తగ్గించాలని.. ఎక్కడ తగ్గిస్తే బాగుంటుందోననే విషయాలను అల్లు అరవింద్ వివరించినట్లు తెలుస్తోంది.

పూజా హెగ్డే క్లీవేజ్ సెగలు.. తట్టుకోగలమా..?

కానీ దీనికి మొదట్లో త్రివిక్రమ్ ఒప్పుకోలేదట. దాంతో అరవింద్ కి త్రివిక్రమ్ కి మధ్య ఇబ్బందికర వాతావరణం ఏర్పడినట్లు సమాచారం. ఈ విషయంలో బన్నీ కలుగజేసుకొని, తన తండ్రికి.. త్రివిక్రమ్ కి సర్దిచెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇది ఇలా ఉండగా.. 'అల వైకుంఠపురములో' సినిమా నిడివి రెండు గంటల నలభై నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు సెన్సార్ కాపీ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. అంటే ఫైనల్ గా అల్లు అరవింద్ తన మాట నెగ్గించుకున్నాడని తెలుస్తోంది. అలానే సినిమాలో మరో పాట చిత్రీకరించాల్సివుంది. సెన్సార్ కాపీలో ఆ పాట లేదు. ఆ పాటని సెపరేట్ గా సెన్సార్ చేయించి యాడ్ చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా యాడ్ చేస్తే మరో ఐదు నిమిషాల నిడివి పెరిగే ఛాన్స్ ఉంటుంది.