వెంకీ, అందాల తార ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలు చాలా మంది సినీ అభిమానులకు ఫేవరెట్ మూవీ గా మారిపోయింది. ఆ చిత్రంలో వెంకీ, ఆర్తి అగర్వాల్ కెమిస్ట్రీ, కామెడీ, సంగీతం అన్ని అంశాలు తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఆ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేశారు. 

ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఓ చిత్రంలో నటిస్తే బావుంటుందనేది అభిమానుల కోరిక. కొన్ని రోజుల క్రితం ఈ కాంబినేషన్ కు సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి. హారిక అండ్ హాసిని సంస్థ నిర్మాణంలో త్రివిక్రమ్, వెంకీ చిత్రం ఉండబోతోందంటూ వార్తలు కూడా వచ్చాయి. 

కానీ త్రివిక్రమ్, వెంకీ ఎవరికి వారు వారి చిత్రాలతో బిజీ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు వెంకీ, త్రివిక్రమ్ కంబోకి సంబంధించిన కదలికలు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు. వెంకటేష్ 74వ చిత్రంగా తమిళ మూవీ అసురన్ రీమేక్ ఉండబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. 

దీనితో వెంకీ ల్యాండ్ మార్క్ మూవీ 75వ చిత్రం గురించి చర్చ మొదలైంది. వెంకీ 75వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్ట్ చేయబోతున్నట్లు టాక్. ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అసురన్ చిత్రం తర్వాత వెంకీ, త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కనున్నట్లు టాక్.