ఫైనల్ గా అల వైకుంఠపురములో సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫామ్ లోకి వచ్చేశారు. అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ అందుకున్న మాటల మాంత్రికుడు అరవింద సమేత సినిమాతో అనుకున్నంత విజయాన్ని దక్కించుకోలేకపోయాడు. ఇక అల..వైకుంఠపురములో.. ఇచ్చిన బూస్ట్ తో నెక్స్ట్ అదే రేంజ్ లో ఎన్టీఆర్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ వీలైనంత త్వరగా ఆ మల్టీస్టారర్ సినిమాను పూర్తి చేసి త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమా కోసం త్రివిక్రమ్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మరోసారి సంగీత దర్శకుడిగా థమన్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందట. అరవింద సమేత - అల..వైకుంఠపురములో.. సినిమాలకు ఇచ్చిన సంగీతం ఆడియెన్స్ కి మంచి కిక్కిచ్చాయి.

దీంతో మరొకసారి త్రివిక్రమ్ థమన్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక థమన్ కూడా అన్ని రకాల సినిమాలకు డిఫరెంట్ మ్యూజిక్ అందిస్తు మంచి సక్సెస్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి మాటల మంత్రికుడితో సినిమా అంటే తప్పకుండా హ్యాట్రిక్ మ్యూజికల్ హిట్ అందుకుంటాడాని చెప్పవచ్చు. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న త్రివిక్రమ్ తదుపరి సినిమాను హరికా హాసిని - ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించనున్నాయి.